నారప్ప చిత్రం గట్టి డీల్ కే సెట్ అయ్యిందిగా!

Published on Jul 13, 2021 8:27 pm IST

విక్టరీ వెంకటేష్ హీరోగా, ప్రియమణి హీరోయిన్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రం ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు జూలై 20 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సురేష్ బాబు మరియు కలైప్పులి కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 40 కోట్ల రూపాయలకు నారప్ప ను విక్రయించినట్లు తెలుస్తోంది.

అయితే డీల్ పై ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చలు జరుగుతున్నాయి. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రానికి రీమేక్ అని అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ కారణంగా థియేటర్ల కి ఆ స్థాయిలో ప్రేక్షకులు వస్తారో లేదో అనే అనుమానం దర్శక నిర్మాతల్లో కూడా ఉంటుంది అని చెప్పాలి. ఆ విధంగా చూసుకుంటే నారప్ప కి వచ్చిన డీల్ చాలా వరకు సబబే అని తెలుస్తోంది. అంతేకాక ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా నిర్మాతలకు కాస్త లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :