నారప్ప విడుదలకు చర్చలు.. ఫస్ట్ కాపీ రెడీ !

Published on Jun 17, 2021 6:57 am IST

విక్టరీ వెంకటేష్‌ ‘నారప్ప’ సినిమా గురించి ఈ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చెప్పుకొచ్చాడు. ‘మరో వారం రోజుల్లో నారప్ప ఫస్ట్‌ కాపీ పూర్తి అవుతుందని, రిలీజ్ డేట్ విషయం పై చర్చిస్తున్నాం అని, త్వరలోనే నారప్ప విడుదలను అధికారికంగా ప్రకటిస్తాం అని శ్రీకాంత్ తెలియజేశాడు.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌, పోస్టర్స్‌ తో పాటు టీజర్‌ కూడా బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. సురేష్‌ బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మించిన ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్‌ ఉన్న పాత్రలో వెంకీ అలరించనున్నాడు.

అందుకే వెంకీ అభిమానులు ఈ చిత్రంకై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :