‘మా’ ఎన్నికల పై నరేష్ వివరణ !

Published on Jun 26, 2021 7:01 pm IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేశ్‌ మీడియా ముందుకు వచ్చారు. తాను అధ్యక్షుడిగా ‘మా’ ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ‘ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయమని నన్ను ఎవ్వరూ అడగలేదు. నాకెంతో ఆప్తురాలైన సీనియర్‌ నటి జయసుధకు అండగా ఉండాలని.. ‘మా’లో మార్పు తీసుకురావాలని ఎన్నికలకు వెళ్లాను.

కానీ గడిచిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆవిషయం నన్ను ఎంతో బాధించింది. ఆ తరువాత ప్రెసిడెంట్‌ అయి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను.’ సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుంది. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. ఇండస్ట్రీ బిడ్డ.. కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు’ అని నరేశ్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :