అల్లరోడి పుట్టిరోజు సంధర్బంగా ‘బంగారాబుల్లోడు’ మరో లుక్.

Published on Jun 30, 2019 10:57 am IST

అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న చిత్రం “బంగారాబుల్లోడు”. నేడు ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకొని ఈ చిత్రంలోని మరొక లుక్ ని విడుదల చేశారు. పి వి గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అల్లరి నరేశ్ సరసన హీరోయిన్ గా పూజా ఝవేరి నటిస్తుంది.

ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు ఇవివి సత్యనారాయణ చిన్న కుమారుడైన అల్లరి నరేష్ 2002లో వచ్చిన “అల్లరి” చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ నటనతో ఇండస్ట్రీలో కామెడీ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు.

రాజేంద్రప్రసాదు హీరోగా నెమ్మదించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన ఏకైక హీరో అల్లరి నరేష్. దాదాపు 18ఏళ్ల సినీ ప్రస్థానంలో 50పైగా సినిమాలు చేసారంటేనే తెలుస్తుంది ఆయన కామెడీ హీరోగా ఎంతటి విజయం సాధించారో. ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోలలో నరేశ్ ఒకరు. ఇటీవల విడుదలైన “మహర్షి” మూవీలో మహేష్ స్నేహితుడిగా ఓ కీలకపాత్ర చేసి మెప్పించారు.

సంబంధిత సమాచారం :

More