మరో స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేష్ ?

Published on Jun 6, 2019 6:21 pm IST

చాలా ఏళ్లుగా విజయం అనే మాటకు దూరంగా ఉన్న అల్లరి నరేష్ తాజాగా మహేష్ బాబు చేసిన ‘మహర్షి’ సినిమాతో సక్సెస్ రుచి చూశారు. ఆ చిత్రంలో మహేష్ స్నేహితుడిగా నటించిన నరేష్ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ సినిమాతో ఆయనకు ఇలాంటి అవకాశాలే ఇంకొన్ని వస్తున్నాయి. తాజాగా మరొక స్టార్ హీరో సినిమాలో సైతం ముఖ్య పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడట నరేష్.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు రవితేజ. ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో కీలక పాత్ర కోసం నరేష్ వద్దకు వెళ్లారట దర్శక నిర్మాతలు. ఒకవేళ ఈ కాంబినేషన్ గనకు సెట్టైతే ఇది నరేష్, రవితేజలు కలిసి చేస్తున్న రెండవ సినిమా అవుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి ”శంభో శివ శంభో’ చిత్రంలో కలిసి నటించడం జరిగింది. ఆ చిత్రంలో కూడా నరేష్ నటనకు గొప్ప ఫీడ్ బ్యాక్ లభించింది.

సంబంధిత సమాచారం :

More