ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు బాక్సాఫీస్ దగ్గర అలరించేందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యువ హీరోలు నవీన్ పొలిశెట్టి అలాగే శర్వానంద్ హీరోగా నటించిన చిత్రాలు అనగనగా ఒక రాజు అలాగే నారీ నారీ నడుమ మురారి కూడా ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు కూడా డీసెంట్ టాక్ ని తెచ్చుకోగా సాలిడ్ ఓపెనింగ్స్ ఈ సినిమాలు అందుకున్నాయి.
చాలా వరకు లిమిటెడ్ స్క్రీన్స్ లోనే విడుదల అయ్యిన ఈ సినిమాలు నైజాం మార్కెట్ లో లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్ తెలుస్తున్నాయి. పి ఆర్ లెక్కల ప్రకారం నైజాంలో ఈ సినిమాలు సంక్రాంతి రోజు లెక్కలు ఎంతంటే అనగనగా ఒక రాజు సినిమాకి 1.5 కోట్ల షేర్ ని రాబట్టగా మొత్తం రెండు రోజుల్లో 2.9 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక నారీ నారీ నడుమ మురారి అయితే చాలా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి 60 లక్షల షేర్ ని రాబట్టింది. సో ఈ రెండు సినిమాలు మంచి పెర్ఫార్మన్స్ నే కనబరుస్తున్నాయి అని చెప్పొచ్చు.


