నాగశౌర్య ‘@నర్తనశాల’కు అన్ని కలిసొస్తున్నాయి !

nartanashalla2

యువ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘@నర్తనశాల’. కొద్దీ సేపటి క్రితం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఈ ఇచ్చింది. ఇక ఈ సినిమా బాగుందని ఈ చిత్రం నాగశౌర్య నటించిన సూపర్ హిట్ ‘ఛలో’ కంటే పెద్ద హిట్ అవుతుందని చిత్ర వర్గాలనుండి సమాచారం వస్తుంది.

ఇక ఈ చిత్రం ఆగస్టు 30న సోలో గా విడుదలవుతుంది. ఈచిత్రానికి నాగ చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ నుండి గట్టి పోటీ ఎదురువుతుందనుకున్న దశలో ఆ చిత్రం రెండు వారాల వెన్నక్కి వెళ్లిపోయింది. దాంతో ఈచిత్రానికి ఆ రకంగా కూడా చాలా కలిసొచ్చింది. ఇక ఈచిత్రం ఫై నాగ శౌర్య కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. మరి ఇన్ని పాజిటివ్ పరిస్థితుల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈనెల 30వరకు ఆగాల్సిందే.

Exit mobile version