ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు

Published on Jun 30, 2021 9:01 pm IST

కరోనా మొదలైనప్పటి నుండి నటీనటులు చాలామంది ఆసుపత్రులు పాలయ్యారు. కొందరు కరోనా సోకి ఇబ్బందులు పడితే ఇంకొందరు వయో భారంతోఎదురయ్యే సమస్యలతో హాస్పిటల్ పాలయ్యారు. పలు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, నటీ నటులు కరోనా సోకి కన్నుమూశారు. బాలీవుడ్ పరిశ్రమ అయితే ఈమధ్య కాలంలో పలువురు ప్రముఖులను కోల్పోయింది. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు నజీరుద్దిన్ షా ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ కావడం కంగారుకు గురిచేస్తోంది.

ఊపిరితిత్తుల్లో ఇబ్బంది తలెత్తడంతో ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చేరవలసిన వచ్చింది. ఆయన ఆరోగ్య సమస్యకు కారణం నిమోనియా అని తెలిసింది. నజీరుద్దిన్ షా మేనేజర్ మాట్లాడుతూ నిమోనియా మూలంగానే నజీరుద్దిన్ షా ఆసుపత్రిలో చేరడం జరిగిందని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని నసీరుద్దీన్‌ భార్య రత్నా పథక్‌ తెలిపారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. నజీరుద్దిన్ షా కేవలం హిందీలోనే కాదు ఇతర భాషల ప్రేక్షకులకు కూడ సూపరిచితులు.

సంబంధిత సమాచారం :