ఏకకాలంలో రెండు సినిమాలు చేసేస్తున్న నాని.?

Published on Apr 24, 2021 2:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “టక్ జగదీష్” రీలీజ్ రెడీ అయ్యి మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ మూలాన వాయిదా అయిన సంగతి తెలిసిందే. మరి అలాగే ఇది లైన్ లో ఉండగానే టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో “శ్యామ్ సింగ రాయ్” అనే భారీ బడ్జెట్ సినిమా కూడా ఓకే చేసేసారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు ఓ భారీ సెట్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ టాక్ ఏమిటంటే నాని ఏకకాలంలో రెండు సినిమాలు చేస్తున్నాడట. ఓ పక్క శ్యామ్ సింగ రాయ్ తో పాటుగా మరో టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న “అంటే సుందరానికి” అనే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ను టేకప్ చేసాడు.

ఇపుడు నాని ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఏకకాలంలో నటిస్తున్నాడట. ఈ రెండు చిత్ర యూనిట్స్ తగు జాగ్రత్తలు తీసుకుని కానిచ్చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ కు పరిచయం కానుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :