“మేజర్” లాంటి టీజర్ చూసి చాన్నాళ్ళయ్యింది – నాని

Published on Apr 11, 2021 10:00 pm IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో రానున్న పలు ఆసక్తికర మరియు మోస్ట్ అవైటెడ్ టీజర్స్ లో టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ చిత్రం “మేజర్” టీజర్ కూడా ఒకటి. ఈ టీజర్ ను శేష్ రేపు ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. అయితే అంతా ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో నాచురల్ స్టార్ నాని తన స్పందనను తెలియజేసాడు.

తాను ఆల్రెడీ టీజర్ చూశానని, చాలా రోజులు తర్వాత ఓ మంచి టీజర్ చూసిన అనుభూతి మేజర్ టీజర్ చూసాక కలిగింది” అని తాను తెలిపారు. దీనితో అడివి శేష్ కూడా నానికి ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ చిత్రం ముంబై దాడులలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తుండగా వచ్చే జూలై 2న పాన్ ఇండియన్ లెవెల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :