నాని కోసం లాక్ డౌన్ లో కూడా స్క్రిప్ట్ రాస్తోన్న డైరెక్టర్ !

Published on Apr 2, 2020 11:00 pm IST

మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. ఇక ఈ సినిమా తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావించారు. అందుకు తగ్గట్లుగానే మారుతి, నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని చాలాసార్లే అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. అయితే వచ్చే ఏడాది వీరి కాంబినేషన్ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి.

వీరి ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్టు ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో భాగంగా ఖాళీగా ఉన్న మారుతి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. ఇకపోతే ప్రస్తుతం ‘వి’ చిత్రం చేస్తున్న నాని త్వరలో ‘టక్ జగదీష్’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :