ప్రముఖ సినీ గాయకుడికి ప్రముఖుల శ్రద్ధాంజలి !

Published on May 17, 2021 12:00 pm IST

కరోనా వైరస్‌ సోకి అశువులు బాసిన ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు జీ ఆనంద్‌ ను గుర్తు చేసుకుంటూ ఆనంద్‌ కు పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. నవసాహితీ ఇంటర్నేషనల్‌ వారు శనివారం రాత్రి “ఒక వేణువు వినిపించిన విషాద గీతిక’ పేరున స్వర నివాళులర్పించారు. అంతర్జాలమే వేదికగా ఏర్పాటు చేసుకుని నిర్వహించిన ఈ కారక్రమంలో దేశ, విదేశాల నుంచి పలువురు పాల్గొన్నారు.

జీ ఆనంద్‌తో తమకున్న పరిచయాన్ని, అనుభవాలను, ఆనందపు క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ముందుగా, నవసాహితీ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌వీ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సంగీతం, సాహిత్యాభిలాషతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆనంద్‌కు ఆప్తుడయ్యానని చెప్పారు. ఎస్పీ బాలుకు, ఆనంద్‌కు సినీ పరిశ్రమ ఘన నివాళులర్పించకపోవడం బాధాకరమన్నారు.

సంబంధిత సమాచారం :