హీరో న‌వ‌దీప్‌ చేతుల మీదుగా ‘సండే స్పెష‌ల్‌’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ విడుదల

Published on Jul 2, 2021 10:00 am IST

రియాన్ష్, నిత్యా శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `సండే స్పెష‌ల్‌`. అనూప్ చ‌క్ర‌వ‌ర్తి బాజినేని ద‌ర్శ‌క‌త్వంలో మ్యాన్‌కైండ్ మూవీస్ & పెలికుల‌24 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రామ‌కృష్ష బ‌లుసు మ‌రియు జ్యోతి బాజినేని నిర్మిస్తున్నారు.

`సండే స్పెష‌ల్‌` మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను హీరో న‌వ‌దీప్ విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. క్రియేటివ్‌గా ఈ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అభి పెయ్యాల సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సంబంధిత సమాచారం :