నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓరి నాయనో’ మూవీ టైటిల్ లాంచ్

నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓరి నాయనో’ మూవీ టైటిల్ లాంచ్

Published on Jul 12, 2026 9:00 PM IST

హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓరి నాయనో’ సినిమా టైటిల్, ఆఫీస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గొండి మణితేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఎవ్రీ లైఫ్ విల్ హావ్ ఓరి.. నాయనో! మోమెంట్’ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. మాదాపూర్‌లోని చిత్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మా ఊరి పొలిమెర’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, రాజా రవీంద్ర, డీవోపీ వెట్రి పళనిస్వామితో పాటు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

​ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అయ్యేలా, వినోదం మరియు భావోద్వేగాల కలయికతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు గొండి మణితేజ తెలిపారు. నేటి సమాజాన్ని ప్రతిబింబించే పాత్రలతో కూడిన వైవిధ్యమైన కథ ఇదని చిత్ర బృందం పేర్కొంది. రోహిత్ కంభంపాటి, డా. ప్రవీణ్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎ. సుభాష్ నాథన్ ఛాయాగ్రహణం, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

​ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ప్రధాన తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు