‘ఎవరు’లో తన క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్‌ అట !

Published on Aug 14, 2019 1:00 am IST

వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా క‌సండ్ర హీరోయిన్‌ గా నవీన్ చంద్ర కీలక పాత్రలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌ పై పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో… నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్‌తో ఉన్నాం. పి.వి.పిగారికి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు. నేను యాక్టర్ కాకముందు నుండి ఓ డ్యాన్స్ టీచర్‌ గా.. కొన్ని స్కూల్స్‌కు డ్యాన్స్ నేర్పించేవాడిని. నా క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్‌ గా అనిపించింది. వంశీతో ఆల్ రెడీ ఓ సినిమా చేశాను . ట్రైలర్, టీజర్ చూసి అందరూ మాట్లాడుతున్నారు. శ్రీచరణ్ మ్యాజిక్ చేసి సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు అన్నారు.

కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. ఈ చిత్రానికి శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా.. వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సస్పెన్స్ రేకెత్తించే అంశాలతో పాటు సీరియస్ గా సాగే మర్డర్ కేసు గురించి చేసే విచారణ కూడా చాల బాగుంటుందని చిత్రబృందం చెబుతుంది. అలాగే రెజీనా, అడవి శేష్ మరియు నవీన్ చంద్ర పాత్రల మధ్య సాగే డ్రామా కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట.

సంబంధిత సమాచారం :