
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ కృష్ణ ‘అయినా నువ్వు ఇష్టం’ అనే సినిమా ద్వారా తెరారంగ్రేటం చేస్తున్న విషయం తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది.
తాజా సమాచారం ప్రకారం నవీన్ కృష్ణ మరో కొత్త ప్రాజెక్ట్ ని అంగీకరించినట్టు సమాచారం. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం టాలీవుడ్ కి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్ర కధాకధనాలు చాలా కొత్తగా వుంటాయని, శ్రీలంకలో 45రోజుల షూటింగ్ జరగనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

