భారీ విరాళం ప్రకటించిన స్టార్ హీరోయిన్

Published on Apr 4, 2020 5:14 pm IST


కరోనా వైరస్ కారణంగా ప్రపంచంతో పాటు భారత్ స్థంభించి పోయింది. ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా టోటల్ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీనితో దేశంలోని పరిశ్రమలు అన్ని కుప్పకూలాయి. కరోనా వైరస్ చిత్ర పరిశ్రమలను కూడా తీవ్రం సమస్యలలోకి నెట్టింది.ఈ పరిశ్రమపై ఆధారపడిన రోజువారి కార్మికులు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

కాగా నటి నయనతార భారీ విరాళం ప్రకటించింది. ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా)కు ఆమె 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇప్పటికే ఐశ్వర్య రాజేష్, విజయ్ సేతుపతి వంటి వారు విరాళం ప్రకటించడంతో అందరూ స్టార్ హీరోయిన్ గా ఉన్న నయనతారను టార్గెట్ చేసారు. అందరి విమర్శలకు చెక్ పెడుతూ నేడు నయనతార ఈ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. టాలీవుడ్ లో కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో చిరంజీవి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతోంది. తమిళనాడులో కూడా పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సహాయం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More