జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్న నయనతార!

31st, July 2016 - 03:47:26 PM

nayanatara

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార, కొద్దికాలంగా ఎక్కువగా బలమైన పాత్రలనే ఎంచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ‘మయూరి’, ‘నేనూ రౌడీనే’, ‘బాబు బంగారం’, ‘ఇరు ముగన్’ లాంటి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక త్వరలోనే ఆమె నటించనున్న ఓ తమిళ సినిమాలోనూ బలమైన పాత్రలోనే కనిపించనున్నారు. ఒక ఊరికి సంబంధించి తాగునీటి సమస్య గురించి చర్చించే ఈ సినిమాలో నయనతార కలెక్టర్‌గా కనిపించనున్నారని టీమ్ తెలిపింది.

గోపీ నానర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు నయనతార పాత్రే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. కాక్క ముట్టై సినిమాలో మెప్పించిన బాలనటులు విగ్నేష్, రమేష్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకెళ్ళి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంటోంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే, సినిమా ఒప్పుకున్న నయనతార గారు సినిమాకే హైలైట్‌గా నిలుస్తారని దర్శకుడు తెలిపారు.