చకచకా సినిమాలు ఫినిష్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్

19th, October 2016 - 06:40:15 PM

nayanatara
తమిళ, తెలుగు పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును కూడా అందుకున్న నటి నయనతార. ‘ఇరుముగన్’ సినిమాతో మంచి విజయాన్నందుకున్న ఈమె ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ఒక చిత్రం యొక్క షూటింగ్ ను తాజాగా ఫినిష్ చేసింది నయన్. దర్శకుడు గోపి నైనర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ ఇటీవలే మధురైలోని రామాంతపురం దగ్గర్లో జరిగింది. సుమారు 24 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరిగింది.

నయన్ ఈ 24 రోజులు వరుసగా షూటింగ్ లో పాల్గొని ఘాటింగ్ ముగించేసింది. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో సుమారు 1000మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ షెడ్యూల్ జరిగింది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందున్న ఈ చిత్రంలో నయన్ కలెక్టర్ గా కనిపిస్తూ ఓ సామాజిక సమస్యపై పోరాడుతుందట. ఈ ప్రాజెక్టుకి ఎడిటర్ గోపి కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ మాల్గుడి ఇళయరాజా, కెమెరామన్ ఓం ప్రకాష్ వంటి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. ప్రస్తుతం సిజి వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరికొన్ని రోజుల్లో విడుదలకానుండగా ఈమె నటించిన ‘కాష్మోరా’ చిత్రం ఈ నెలాఖరు విడుదల కానుంది.