లేడీ సూపర్ స్టార్ నయన తార ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్కా నొడిగళ్’. గతఏడాది విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని ‘అంజలి సిబిఐ ఆఫీసర్’ అనే టైటిల్ తో తెలుగులో కి డబ్ చేశారు. ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు.
అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , అథర్వ మురళి , రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో విశ్వాసం తో హిట్ కొట్టిన నయన్ ప్రస్తుతం మరో రెండు భారీ చిత్రాల్లో నటిస్తుంది. అందులో ఒకటి సైరా కాగా మరొకటి విజయ్ 63 ఈ రెండు చిత్రాలుకూడా ఈఏడాది లోనే విడుదలకానున్నాయి.


