టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్‌తో పాటు నయనతార కూడా సొంతంగా భారీ యాక్షన్ స్టంట్స్ చేయబోతుందని తెలుస్తోంది.
షూటింగ్ సెట్స్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ‘ది మెసెంజర్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా, 2027 ఈద్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రముఖ నటులు అక్షయ్ ఖన్నా లేదా ఫహద్ ఫాజిల్‌లను సంప్రదిస్తున్నట్లు బిటౌన్ వర్గాల సమాచారం.
మరోవైపు, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అపూర్వ లఖియా దర్శకత్వంలో తాను నటించిన దేశభక్తి నేపథ్య చిత్రం ‘మాతృభూమి’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. మరి సల్మాన్ కోసం నయన్ చేయబోయే యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో వేచి చూడాలి.


