
నయనతార, శింబు మరోసారి ఒకర్నొకరు ప్రేమించుకుంటున్నారా?? ఈ ప్రశ్న ఇప్పుడు కోలీవుడ్ లో లేటెస్ట్ టాపిక్ గా నిలిచింది. ఒకానొక సమయంలో విడదీయరాని ప్రేమజంటగా నిలిచిన వీరు 2006లో ఒకరికొకరు గుడ్ బై చెప్పుకుని విడిపోయారు. ఆ తరువాత నయన్ ప్రభుదేవాతో, శింబు హన్సికతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు
అయితే వీరిద్దరూ ఇటీవలే జరిగిన త్రిష జన్మదిన వేడుకలో చాలా క్లోజ్ గా కనిపించారు. వీరి మనస్పర్ధలు వీడి మరోసారి కలిసిపోయారని నవంబర్ నుండి వినిపిస్తున్నా ఈ మధ్యే వీరిమధ్య దగ్గరతనం పెరిగిందని సమాచారం
ప్రస్తుతం నయన్, శింబు కలిసి పాండిరాజ్ తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. వీరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు భారీ ఆకర్షణ అని సమాచారం. మరి భవిష్యత్తులో వీరి ప్రేమపై అధికారిక వార్త ఎమన్నా వస్తుందేమో వేచిచూడాలి