‘టాక్సిక్’ కొత్త సాంగ్ లో షాకిచ్చిన నయన్.. ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి ఇలా

‘టాక్సిక్’ కొత్త సాంగ్ లో షాకిచ్చిన నయన్.. ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి ఇలా

Published on Jul 21, 2026 1:57 PM IST

Toxic

దక్షిణాది సినిమా దగ్గర మంచి స్టార్డం ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో కోలీవుడ్ ఆడియెన్స్ లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నటి నయనతార కూడా ఒకరు. తన కెరీర్ ఆరంభంలో బోల్డ్ రోల్స్ కూడా చేసి మెప్పించి ఇపుడు ఓ సెటిల్డ్ స్టార్ హీరోయిన్ గా ఆమె సెలెక్టీవ్ గా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తుంది.

అయితే గ్లామర్ వంటి అంశాలు పక్కన పెట్టేసిన నయన్ లేటెస్ట్ గా చేస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ నుంచి వచ్చిన కొత్త సాంగ్ లో నయనతార అందరికీ షాకిచ్చింది. ఈ సినిమాలో ఆమె రోల్ యాక్షన్ వేరియేషన్ లోనే ఉంటుంది అనుకుంటే ఆమెతో సిగరెట్ కూడా తాగించారు. ఇప్పుడు వచ్చిన రెండో సాంగ్ లో ఇదే అన్ని అంశాల కంటే మరో హైలైట్ గా నిలిచింది.

ఆమె కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు రెండు దశాబ్దాల పైనే అయ్యింది. మధ్యలో బిల్లా సహా మరికొన్ని సినిమాల్లో బోల్డ్ సీన్స్ కూడా చేసింది కానీ స్మోక్ చేస్తూ కనిపించింది మాత్రం ఈ ఒక్క సినిమా లోనే అని చెప్పొచ్చు. పాత్రలని, చాలా జాగ్రత్తగా ఎంచుకునే నయన్ కి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఏం చెప్పి ఈ సీన్ కి ఒప్పించారా అని ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. సో చూడాలి సినిమాలో ఆమె రోల్ ఎలా ఉంటుంది అనేది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు