నయనతార కన్ఫ్యూజన్ తీరిపోయింది

Published on Jun 11, 2021 11:00 pm IST

లాక్ డౌన్ ప్రభావంతో చాలా సినిమాల విడుదలలు సందిగ్ధంలో పడిపోయాయి. సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేకపోవడంతో చిన్న సినిమాల నిర్మాతలు చాలామంది ఓటీటీ విడుదలకు మొగ్గుచూపుతున్నారు. నయనతార కొత్త చిత్రం ‘నెట్రికన్’ చిత్రం కూడ అన్ని పనులు పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ ముగింపు దశలో ఉన్నాయి. దీంతో చిత్ర నిర్మాతలు ఓటీటీకి వెళ్ళాలా వద్దా అనే విషయంలో ఆలోచనలో పడ్డారు. పలు చర్చల అనంతరం ఓటీటీలోనే సినిమాను రిలీజ్ చేయాలని నయనతార, నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ద్వారా చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. జూలై నెలలో ఈ సినిమా విడుదల ఉండవచ్చని తెలుస్తోంది. ఓటీటీల్లో నయనతార సినిమాలకు మంచి డిమాండే ఉంది. కాబట్టి నిర్మాతలు ఓటీటీ నుండి మంచి ఆఫరే దక్కించుకుని ఉంటారు. కంటి చూపు లేని కథానాయిక తన వినికిడి శక్తిని ఉపయోగించి సీరియస్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనేదే ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని నయన్ ప్రేమికుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ నిర్మిస్తున్నాడు. ‘గృహం’ చిత్ర దర్శకుడు మిలింద్ రావ్ ఈ సినిమాకు దర్శకుడు.

సంబంధిత సమాచారం :