‘మయూరి’గా నయనతార భయపెడుతుందట.

‘మయూరి’గా నయనతార భయపెడుతుందట.

Published on Feb 26, 2015 12:26 PM IST

nayanathara (1)
ప్రముఖ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ సినిమా ‘మాయ’. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ‘మయూరి’ అనే టైటిల్ ఖరారు చేశారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఆరి హీరోగా నటిస్తున్నారు.

‘అనామిక’ తర్వాత నయనతార నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఈ సినిమాలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుంది. ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రల్లో సందడి చేసిన నయనతార.. ‘మయూరి’గా భయపెట్టడం గ్యారెంటీ అని దర్శకనిర్మాతలు చెప్తున్నారు.

పోటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు