చిరు – అనీల్ ప్రాజెక్ట్ కోసం నయన్ కి భారీ రెమ్యునరేషన్?

చిరు – అనీల్ ప్రాజెక్ట్ కోసం నయన్ కి భారీ రెమ్యునరేషన్?

Published on May 18, 2025 3:39 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి కాంబినేషన్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం కూడా ఒకటి. మెగాస్టార్ కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార నటిస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ చిత్రానికి నయన్ ఎప్పుడూ లేనిది ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడం ఒకింత ఆసక్తిగా కూడా మారింది.

ఇక ఇవి పక్కన పెడితే ఈ సినిమాకి నయన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈమె ఏకంగా 18 కోట్ల మేర రెమ్యునరేషన్ ని అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రం సౌత్ హీరోయిన్స్ అత్యధికం అన్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ అవైటెడ్ చిత్రం షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు