నయనతారకు ఎలాంటి దిగులూ లేదు

Published on Jun 18, 2021 9:02 pm IST

సౌత్ స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. లేడీ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నయనతార చాలా ఏళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్లో కొనసాగుతోంది. చేతి నిండా సినిమాలతో బిజీగా బిజీగా ఉంటోంది నయన్. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సైన్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘నెట్రికారన్’ త్వరలోనే ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది. ఇది కాకుండా రజినీకాంత్, శివల కాంబినేషన్లో రూపొందుతున్న ‘అన్నాత్తే’ సినిమాలో కూడా నయన్ కథానాయికగా నటిస్తోంది.

ఈ రెండూ కాకుండా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి ఒక చిత్రం చేస్తోంది. వరుస లాక్ డౌన్స్ ప్రభావంతో సినిమాల జోరు తగ్గడంతో చాలామంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గాయి. ఒకప్పుడు రెండు మూడు సినిమాలతో బిజీగా గడిపిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఒకటి అర సినిమాతో సర్దుకుంటున్నారు. కొందరైతే పారితోషకం కూడ తగించుకుని ఆఫర్ల కోసం చూస్తున్నారు. కానీ నయనతారకు మాత్రం అలాంటి దిగులేమీ లేదు. ప్రజెంట్ చేస్తున్న మూడు సినిమాలే కాకుండా ఇంకో రెండు కొత్త సినిమాలకు ఇటీవలే సైన్ చేసిందట ఆమె. ఈ రెండు చిత్రాలకు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :