బాహుబలి సిరీస్ లో నయనతార.. ఇది రూమరే !

Published on Jul 17, 2021 10:08 pm IST

బాహుబలి వెబ్ సిరీస్ చేయాలని గతంలో ప్లాన్ చేశారు. ఈ సిరీస్ కి సంబంధించి కొంత భాగం షూట్ కూడా చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల నిర్మాతలు మారారు. మళ్ళీ ఈ సిరీస్ కొత్తగా తీయాలని చాల ప్రయత్నాలు చేసే క్రమంలో రెండు సార్లు షూట్ కూడా స్టార్ట్ చేసినా షూటింగ్ పూర్తి కాలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సిరీస్ మళ్ళీ మొదలైందని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిరీస్ కొనసాగుతుంది. అసలు శివగామి రాజమాత ఎలా అయింది ? ఆమె బాహుబలిని చంపించడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? లాంటి అంశాల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో శివగామి పాత్రకి ‘నయనతార’ని సంప్రదించారనే వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఆలాగే శివగామి యువతిగా ఉన్న పాత్ర కోసం ‘వామికా’ను తీసుకున్నారనేది కూడా అవాస్తవమేనట.

సంబంధిత సమాచారం :