షార్ట్ ఫిల్మ్స్ దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన నయనతార !

దర్శకుడవ్వాలనే కసితో చేసే నిజాయితీతో కూడిన ఏ చిన్న ప్రయత్నమైనా ఒక్కోసారి పెద్ద ఫలితాన్నే ఇస్తుంది. అలాంటి ఫలితాన్నే తమిళ షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు సర్జున్ కె.ఎమ్ అందుకున్నారు. ఇదివరకు ఈ దర్శకుడు చేసిన ‘లక్ష్మి’ అనే షార్ట్ ఫిల్మ్ బాగా ప్రాచుర్యం పొందగా తాజాగా ఆయన చేసిన మరొక షార్ట్ ఫిల్మ్ ‘మా’ సంచలన విజయాన్ని అందుకుని, కోలీవుడ్లో చర్చనీయాంశమైంది.

యూట్యూబ్లో ఈ లఘు చిత్రానికి 2.7 మిలియన్ల వ్యూస్ దక్కాయి. విమర్శకులు, సినీ పెద్దలు అతని పనితనాన్ని మెచ్చుకోగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఏకంగా అతనికి తనతో సినిమా చేసే బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సర్జున్ కె.ఎమ్ హర్రర్ కంటెంట్ తో తెరకెక్కించనున్నారు. కె.జె.ఆర్ స్టూడియోస్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో మొదలుకానుంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని అప్డేట్స్ కోసం 123తెలుగు చూస్తుండండి.