“బాలయ్య 107” నుంచి మైండ్ బ్లాకింగ్ మాస్ పోస్టర్.!

Published on May 28, 2022 10:39 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన కెరీర్ లో భారీ హిట్ సినిమా “అఖండ” తర్వాత దానికి మించి భారీ హైప్ ని ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంది.

అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఇది వరకే ఒక మాస్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యగా ఈరోజు నందమూరి కుటుంబంకి అభిమానులకి ఎన్టీఆర్ శత జయంతి కానుకగా ఇంకో మైండ్ బ్లోయింగ్ మాస్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ వైట్ అండ్ వైట్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లో కత్తి పట్టుకొని ఉన్న బాలయ్య మంచి అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు.

దీనితో ఒక్కసారిగా అంచనాలు మరింత స్థాయికి వెళ్లిపోయాయని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ మాస్ పోస్టర్ మామూలు ట్రీట్ ఇవ్వట్లేదు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ గా నటిస్తుంది అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :