బాబాయి- అబ్బాయిలు ముచ్చటగా మూడోసారి !

Published on Feb 24, 2019 12:49 pm IST


నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘118’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ , ఎన్టీఆర్ ముఖ్య అతిధులుగా రానున్నారు. ఈ మధ్యకాలంలో వీరు ముగ్గురు కలిసి స్టేజి మీద కనిపించడం ఇది మూడవ సారి. ఇంతకుముందు అరవింద సమేత , ఎన్టీఆర్ కథానాయకుడు ఈవెంట్ లకు వీరు హాజరైయ్యారు. ఇక ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో జరుగనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేత థామస్, శాలిని పాండే కథానాయికలుగా నటిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఈ చిత్రం తో దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1 న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :