బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్లకు ఎన్సీబీ సమన్లు

Published on Sep 23, 2020 9:02 pm IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణలో డ్రగ్స్ రాకెట్ బయటపడిన సంగతి తెలిసిందే. నార్కోటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో పలువురు నటీమణుల పేర్లు ప్రముఖంగా వినిపించడంతో బాలీవుడ్ పరిశ్రమలో ప్రకంపనలు రేగుతున్నాయి. మొదటగా హీరోయిన్ సారా అలీఖాన్ పేరు బయటికి రాగా తాజాగా స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్, దీపికా పదుకొనె పేర్లు కూడ తెర మీదకు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ కు కూడ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు వార్తలు రాగా ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తనపై మీడియాలో నిరాధార ఆరోపణలు, కథనాలు రాకుండా స్టే తెచ్చుకున్నారు.

అయితే తాజాగా విచారణను ముమ్మరం చేసిన నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనెలకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ సబ్‌స్టాన్సెస్ చట్టంలోని సెక్షన్ 68 కింద విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. జాతీయ మీడియా కథనాలా మేరకు దీపికా పదుకొనెను విచారణకు సెప్టెంబర్ 25 హజరుకావాలని, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లను సెప్టెంబర్ 24న విచారణకు హాజరుకావాలని నోటీసుల ద్వారా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తెలియజేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఎప్పుడు ఎవరి పేర్లు బయటికి వస్తాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత సమాచారం :

More