దాదాపు 25 సినిమాలు ఆగిపోయాయి

Published on Apr 23, 2021 12:00 am IST

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఆంక్షల్లో భాగంగా ప్రభుత్వం ముందుగా సినిమా థియేటర్ల మీదనే దృష్టి పెట్టింది. ఇప్పటికే ఒక వరం వైట్ కర్ఫ్యూ విధించగా ఎగిజిబిటర్లు అందరూ కలిసి సినిమా హాళ్లను మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. పైగా షూటింగ్లో ఉన్న సినిమా బృందాలు కరోనా బారినపడుతున్నాయి ఇప్పటికే పలువురు స్టార్లు వైరస్ కు గురయ్యారు. దీంతో నిర్మాతల మండలి 50 మందితో మాత్రమే షూటింగ్ నిర్వహించాలని తేల్చి చెప్పింది. చిన్న సినిమాకు అయినా 50 మందితో షూటింగ్ అంటే కుదరని పని.

ఈ ఇబ్బందుల నడుమ సినిమాలు చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించిన చిత్ర బృందాలు ప్యాకప్ చెప్పేశాయి. ‘ఆచార్య, ఖిలాడి, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, అఖండ’ ఇలా అనేక సినిమాలు ఆగిపోయాయి. ఫిలిం నగర్ వారగల లెక్కల మేరకు దాదాపు 25 సినిమాలకు పైగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. నిర్మాతలు చాలామంది తమ ఆఫీసులను క్లోజ్ చేసుకున్నారు. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గాక, కేసుల సంఖ్య అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ చిత్రీకరణలు మొదలుతాయి. అప్పటివరకు ఈ మూసివేత కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ సెట్స్ మీద ఉన్న కొన్ని సినిమాలు కూడ త్వరలోనే నిలిచిపోనున్నాయి.

సంబంధిత సమాచారం :