ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ లుగా నటిస్తున్న సినిమా “నేడే విడుదల”. ఈ సినిమాను కొత్త దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల డైరెక్ట్ చేస్తున్నారు. అయితే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఎందుకంటే మామ ఇది మన సినిమా అనే హుక్ లైన్ ఆసాంతం, పాటను మళ్ళి మళ్ళి వినేలా వుంది. శ్రీమణి రచించిన ఈ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ మంచి ఈజ్ తో అద్భుతంగా పాడారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని, మరో వారంలో ట్రైలర్ రిలీజ్ చేసి అతి త్వరలో మా సినిమాతో మీ ముందుకు వస్తాం అని తెలిపారు, అంతేకాక ఈ సినిమా మల్టిప్లెక్స్ అభిమాని నుండి నేల టికెట్ సాధారణ ప్రేక్షకుడి వరకూ ప్రతి ఒక్క సినిమా అభిమానికి తప్పకుండా నచ్చుతుంది, అటువంటి కథతో మా “నేడే విడుదల” సినిమాను తెరకెక్కించాం అని తెలిపారు.
లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ లో అందుబాటులో ఉన్న ఈ పాటను మీరు కూడా విని ఆనందించండి
పాట చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


