క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన శ్రీ విష్ణు సినిమా !


యువ హీరో శ్రీవిష్ణు నటించిన కొత్త చిత్రం ‘నీది నాది ఒకే కథ’. టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకునే ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్ని కూడ మొదలుపెట్టారు. అలాగే ముఖ్యమైన సెన్సార్ కార్యక్రమాల్ని కూడ ఈరోజే ముగించారు.

సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడ లేకుండా సినిమాకి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసింది. నూతన దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డోగ్మే 95 అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. ఆరన్ మీడియా పతాకంపై నారా రోహిత్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి, కృష్ణ విజయ్ లు నిర్మించగా సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చారు.