‘నీ చారెడు కళ్లే’ అంటూ ఆకట్టుకున్న బెల్లంకొండ గణేశ్ !

Published on Jun 27, 2022 5:20 pm IST

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘స్వాతి ముత్యం’ సినిమాలో గణేశ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఆహ్లాదకరమైన పోస్టర్‌లు, వినోదాత్మక టీజర్‌ రిలీజ్ అయి పాజిటివ్ బజ్‌ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘నీ చారెడు కళ్లే’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. మహతి స్వర సాగర్ తనదైన మెలోడీ బీట్స్ తో ఆకట్టుకున్నాడు. గణేష్ మరియు వర్ష మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అర్మాన్ మాలిక్ తన గాత్రంతో మంచి అనుభూతిని అందించాడు. కృష్ణకాంత్ సాహిత్యం కూడా బాగుంది.

పైగా ఈ రొమాంటిక్ మెలోడీకి కొరియోగ్రఫీ కూడా సరిగ్గా సరిపోతుంది. ఇక స్వాతిముత్యం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలను పోషించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :