
2013లో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమా ‘ఆషికి 2’. ఈ సినిమాని తెలుగులో ‘నీజగా నేనుండాలి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సచిన్ నజియా జంటగా నటిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని జూన్ 14న హైదరాబాద్ లోని నవోటల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా రామ్ చరణ్ హాజరు కానున్నాడు. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకి కూడా బండ్ల గణేష్ నిర్మాత కాబట్టి కచ్చితంగా ఆడియో వేడుకకి రామ్ చరణ్ వస్తాడని అంటున్నారు.
‘బంపర్ ఆఫర్’ సినిమాకి దర్శకత్వం వహించిన రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి జీత్ గంగూలీ, మిథూన్, అంకిత్ కలిసి సంగీతాన్ని అందించారు.

