సోలోగా బాక్స్ ఆఫీసు బరిలో దిగుతున్న ‘నీజతగా నేనుండాలి’

సోలోగా బాక్స్ ఆఫీసు బరిలో దిగుతున్న ‘నీజతగా నేనుండాలి’

Published on Aug 22, 2014 1:02 AM IST

Nee_Jathaga_Nenundaali
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2’ సినిమాని ‘నీజతగా నేనుండాలి’ పేరుతో తెలుగులో రీమేక్ చేసారు, ఈ సినిమాని ఆగష్టు 22న అనగా రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి వారం రెండు మూడు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడుతూ ఉంటాయి. కానీ ఈ వారం మాత్రం ‘నీజతగా నేనుండాలి’ సినిమా సోలోగా రిలీజ్ అవుతుండడం విశేషం.

వీకెండ్ అనగానే అందరూ సినిమా చూడటానికి ఆసక్తి చూపుతారు. వేరే సినిమా ఏదీ లేకపోవడం మరియు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కాన్సెప్ట్ వలన ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపుతారు. దానివల్ల ఈ సినిమా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టుకునే అవకాశం ఉంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేయడం వలన బాలీవుడ్ లో లానే తెలుగులో కూడా ఈ లవ్ స్టొరీ ప్రేక్షకులను మెప్పిస్తుందని ఈ చిత్ర టీం నమ్మకంగా ఉన్నారు.

ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తున్నందుకు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ‘ఒరేయ్ పండు’, ‘మౌనమేలనోయి’ ఫేం సచిన్ హీరోగా, నజియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రవీంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి జీత్ గంగూలీ, మిథూన్, అంకిత్ కలిసి సంగీతాన్ని అందించారు. .

తాజా వార్తలు