నూతన దర్శకుడు అవినాష్ కోకటి దర్శకత్వంలో అరవింద్ రెడ్డి, శుభంగి పంత్ హీరో హీరోయిన్లుగా తీర్థసాయి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న మూవీ ‘నీ కోసం’. రీ ఫ్రెషింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేమకథలకు భిన్నంగా.. రెండు ప్రేమజంటల కథల్లోని సున్నితమైన ఎమోషన్స్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారట.
కాగా భారతి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సోమశేఖర రెడ్డి,అల్లూరి రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.


