చక్రాల కుర్చీలో “సాహో” విలన్, విషయం ఏమిటంటే?

Published on Jun 18, 2019 1:55 pm IST

రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సాహో”. ఈ మూవీ స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా ఆగస్టు 15న తెలుగు,హిందీ,తమిళ భాషల్లో భారీఎత్తున విడుదల కానుంది. ‘సాహో’ లో ప్రభాస్ కి ప్రతి నాయకుడిగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నీల్ నితిన్ ‘సాహో’ లో తన పాత్రకు సంబంధించిన మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇప్పడు ఈ క్రేజీ విలన్ బాలీవుడ్ లో హీరోగా ఓ మూవీలో నటిస్తున్నారు. “బైపాస్ రోడ్” అనే పేరుతొ తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుందని సమాచారం. ఈ మూవీలో నీల్ నితిన్ ముకేశ్ లుక్ కి సంబంధించి ఓ ఫోటో స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. చక్రాల కుర్చీలో కూర్చుని వికలాంగుడి గెట్ అప్ లో ఉన్న నీల్ లుక్ ఆసక్తికరంగా ఉంది. సస్పెన్స్ థిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి నమన్ నితిన్ ముఖేష్ దర్శకత్వం వహిస్తుండగా, మిరాజ్ గ్రూప్ భాగస్వామ్యంతో ఎన్.ఎన్.ఎమ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీల్ నితిన్ ముకేశ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More