ఆ పాటను ఏకంగా 16కోట్ల మంది చూశారు.

Published on Aug 6, 2020 2:00 pm IST

స్టార్ యాంకర్ గా ఉన్న ప్రదీప్ మాచిరాజు హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఎలా?. ఈ మూవీలోని ఓ సాంగ్ రికార్డుల మోత మోగిస్తుంది. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ వీడియో సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంటుంది. ఇప్పటి వరకు నీలి నీలి ఆకాశం సాంగ్ ని 160 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంటే ఏకంగా ఆ పాటను 16కోట్ల మంది చూశారన్నమాట. అసలు మూవీ విడుదల కాకుండా ఓ డెబ్యూ హీరో సినిమా పాటకు ఆ స్థాయిలో వ్యూస్ రావడం రికార్డు అని చెప్పుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ పాటను స్వరపరిచారు. స్టార్ సింగర్ సిధ్ శ్రీరామ్ అద్బుతంగా పాడారు.

ఇక ఇప్పటికే ఈ మూవీ విడుదల కావాల్సివుంది. మార్చి నెలలో ఉగాది కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఐతే లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. దర్శకుడు మున్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఓ టి టి లో విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుండగా, అందుకు నిర్మాతలు సుముఖంగా లేరని సమాచారం. ఇక ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా వచ్చే ఏడాది విడుదల కానుంది.

వీడియో సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More