విడుదలకు ముందే లీకైన స్టార్ హీరో మూవీ …!

Published on Aug 8, 2019 1:00 pm IST

తమిళ సూపర్ స్టార్ అజిత్ కి పైరసీ మాఫియా ఝలక్ ఇచ్చారు. విడుదలకు ముందే ఆయన తాజా చిత్రంలోని మేజర్ సన్నివేశాలు నెట్లో పెట్టి పరిశ్రమ వర్గాలను షాక్ కి గురిచేశారు. అసలు విషయంలోకి వెళితే అజిత్ తాజా చిత్రం “నెర్కొండ పార్వై” నేడు విడువులైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధిని చాలా సన్నివేశాలు నెట్ లో లీక్ కావడంతో ఇప్పుడు ఆ సన్నివేశాలు సోషల్ మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయని సమాచారం.

అసలు మూవీ విడుదలకు ముందే పైరసీ ఎలా అయ్యిందని ఆలోచించగా “నెర్కొండ పార్వై”చిత్రాన్ని సింగపూర్ వేదికగా ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు,ఈనెల 6న మీడియా ప్రతినిధుల కొరకు చెన్నైలో ఓ షో వేయడం జరిగింది. ఈ రెండు సందర్భాలలోనే కొందరు రహస్యంగా ఈ మూవీని చిత్రించి ఉంటారని కొందరు భావిస్తున్నారు. ఐతే లీక్ అయిన వీడియోలు అంత క్వాలిటీగా లేకపోవడం కొంచెం ఉపశమనం కలిగించే అంశం. నిర్మాత బోనీ కపూర్ ఈ విషయంపై సైబర్ పోలీసులకు పిర్యాదు చేశారని సమాచారం.

2016లో అమితాబ్ హీరోగా విడుదలైన హిట్ మూవీ పింక్ కి “నెర్కొండ పార్వై” తమిళ రీమేక్ కాగా ఈ చిత్రాన్ని హెచ్. వినోత్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :