టీజర్ తో రానున్న రవి తేజ !
Published on Apr 21, 2018 12:00 pm IST

మాస్ మహారాజ రవితేజ చేస్తునం తాజా చిత్రం ‘నేల టికెట్టు’. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ గతంలో ‘సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సినిమాల్ని చేసి ఉండటంతో ఈ సినిమాపై కూడ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ కి మంచి స్పందన దక్కగా చిత్ర యూనిట్ ఇప్పుడు టీజర్ ను సిద్ధం చేసింది.

రేపు 22వ తేదీ ఉదయం 9 గంటలకు టీజర్ విడుదలకానుంది. ఈ చిత్రంలో నూతన నటి మాళవిక శర్మ కథానాయకిగా నటిస్తోంది. శక్తి కాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎస్.టిఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook