ఇంట్రెస్టింగ్ గా..”నెట్ ఫ్లిక్స్” మొట్ట మొదటి తెలుగు సినిమాగా “పిట్ట కథలు”.!

ఇంట్రెస్టింగ్ గా..”నెట్ ఫ్లిక్స్” మొట్ట మొదటి తెలుగు సినిమాగా “పిట్ట కథలు”.!

Published on Jan 20, 2021 12:01 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది “నెట్ ఫ్లిక్స్” అనే చెప్పాలి. ప్రపంచ దేశాలతో పాటుగా మన దగ్గర కూడా మంచి పాపులర్ అయ్యిన ఈ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఇప్పుడు తమ మొట్ట మొదటి తెలుగు ఒరిజినల్ సినిమాను సమర్పించింది.

అది కూడా మన టాలీవుడ్ కు చెందిన మోస్ట్ టాలెంటెడ్ దర్శకులు “పెళ్లి చూపులు” ఫేమ్ తరుణ్ భాస్కర్, “అలా మొదలైంది” లేటెస్ట్ హిట్ “ఓ బేబీ” దర్శకురాలు నందిని రెడ్డి, అలాగే “ఘాజీ” ఫేమ్ సంకల్ప్ రెడ్డి మరియు “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ లు తెరకెక్కించిన చిత్రం ఈ “పిట్ట కథలు”.

స్టార్ హీరోయిన్స్ అమలా పాల్, శృతి హాసన్, అలాగే ఈషా రెబ్బా, ఇంకా తదితర స్టార్ నటులతో ప్లాన్ చేశారు. మరి ఇందులో నాలుగు విభిన్న కథలు కలిగిన మహిళలు వారి జీవితానికి చెందిన ప్రేమ, ఎమోషన్స్ వాటికి వారి నలుగురికి ఉన్న కామన్ కనెక్షన్ ఏమిటి అన్న దానిపై చాలా బోల్డ్ గా తెరకెక్కించారు.

ఇది ఈ టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది. మరి ఎంతో ఆసక్తిగా అనిపిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు వచ్చే ఫిబ్రవరి 19 న స్ట్రీమింగ్ కు తీసుకు రానున్నారు. మరి అలాగే ఈ చిత్రాన్ని ఆర్ ఎస్ పి వి మూవీస్ మరియు ఫ్లైయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం అందించారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు