మెగావర్స్: క్రేజీ ప్రోమోతో మెగాస్టార్ ఓటిటి షో.. సస్పెన్స్ రివీల్ చేసేసిన నెట్ ఫ్లిక్స్!

మెగావర్స్: క్రేజీ ప్రోమోతో మెగాస్టార్ ఓటిటి షో.. సస్పెన్స్ రివీల్ చేసేసిన నెట్ ఫ్లిక్స్!

Published on Nov 24, 2026 12:02 PM IST

Megaverse

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి అవైటెడ్ ఓటిటి డెబ్యూ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి డిగ్గక స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘మెగావర్స్’ అంటూ ఓ సెన్సేషనల్ టాక్ షోని అనౌన్స్ చేసి బిగ్ అప్డేట్ అందించారు. పైగా ఈ షోకి అనేకమంది బిగ్ స్టార్స్ ఎంట్రీ కూడా ఉండడంతో ఆడియెన్స్ మరింత ఎగ్జైట్ అయ్యారు.

అయితే రీసెంట్ గా దర్శనమిచ్చిన ప్రమోషన్స్ హోర్డింగ్స్ లో చిరంజీవి పేరులో N అనే అక్షరం మిస్ కావడం మంచి సస్పెన్స్ ని సెట్ చేసింది. ఎందుకు మిస్ చేశారు అనేది అంతగా వైరల్ గా మారడంతో దీనిపైనే క్రేజీ ప్రోమోని ఇప్పుడు మెగాస్టార్ ఓటిటి షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు నెట్ ఫ్లిక్స్ వాళ్ళు.

ఇక ఫైనల్ గా ఆ N కి అర్ధం నెట్ ఫ్లిక్స్ అనే చిరు లుక్ ని రివీల్ చేసి ఇది నా అడ్డా అంటూ ముగించారు. ఇలా మొత్తానికి ఈ షో విషయంలో ఫ్యాన్స్ కి ఇదో బిగ్ రివీల్ అని చెప్పొచ్చు. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడు నుంచి అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఈ వివరాలు రావాల్సి ఉంది.

తాజా వార్తలు