నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే దాదా. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ సినిమా విడుదలని డిసెంబర్ కి ఫైనల్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ కూడా వదిలారు. కానీ తర్వాత మళ్ళీ ఎలాంటి చప్పుడు లేదు.
దీనితో ఫ్యాన్స్ ఏదన్నా సౌండ్ కోరుకుంటే దాదా తో కుమ్మేస్తాం అని ప్రామిస్ చేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని డిసెంబర్ 24 తేదీ గుర్తు పెట్టుకోండి అదొక జాతర అంటూ హైప్ ఎక్కించారు. సో మొత్తానికి బాలయ్య దాదా ర్యాంపేజ్ రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పెద్ది నిర్మాణ సంస్థ వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Kummestham!!! No doubt 🔥🔥
DECEMBER 24th date gurthu pettukondi – it will be a celebration 💯
#DADA
— DADA (@NBKisDADA) November 23, 2026


