సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సంచలన హిట్ చిత్రం జైలర్ 2 తర్వాత చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ నే ‘ధర్మన్’. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూట్ ని మేకర్స్ చాలా ప్లాన్డ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇలా ఈ డిసెంబర్ మూడో వారానికే మొత్తం సినిమాని ఫినిష్ చేసేయాలని చూస్తున్నట్టుగా టాక్.
ఇక ఈ సినిమాకి మేజర్ గా మిగిలి ఉన్నది ఒక్క సంగీతం పనులే అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అనిరుద్ రీసెంట్ గానే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ధర్మన్ లోకి దిగుతాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విలన్ గా నటిస్తుండగా శ్రీలీల, రాశిఖన్నా తదితరులు నటిస్తున్నారు. అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


