మన టాలీవుడ్ సినిమా దగ్గర తెలుగు నుంచే వచ్చిన హీరోయిన్స్ చాలా తక్కువ పైగా ఉన్న వారికి కూడా అవకాశాలు అరకొర అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇది అందరికీ తెలుసు. అయితే ఈ క్రమంలో వారి ఆవేదనను వ్యక్తం చేసిన హీరోయిన్/నటీమణులు కూడా ఉన్నారు. ఇపుడు వీరి లిస్ట్ లో తాజాగా యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతి చేరింది.
అయితే ఆమెపై మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఆమె తన ఎంట్రీ ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు కూడా కొంచెం బోల్డ్ అండ్ గ్లామర్ షోతోనే చేసింది ఇప్పుడు ఇదే ఆమె ఇంటెన్షన్ ని పక్కకి పెట్టి టార్గెట్ అయ్యేలా చేసింది. ఆమె తమని ఒక పెర్ఫామర్ గా కంటే గ్లామర్ షోస్ కే పరిమితం చెయ్యాలి అనుకునే వారి కోసం మాట్లాడితే..
గ్లామర్ రోల్స్ చేసుకునే నువ్వు కూడా ఇపుడు ఇతర సినిమాల్లో హీరోయిన్స్ వారి గ్లామర్ షోని జడ్జ్ చేస్తున్నావు అనే రీతి కామెంట్స్ ఇపుడు ఆమెపై వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆ రకంగా మాత్రమే ఉన్న సిస్టంని దాటి తమకి కూడా నటన స్కోప్ ఉన్న పాత్రలు ఇస్తే మేము కూడా చేసి ప్రూవ్ చేసుకుంటాం కదా అనే ఆమె ఇంటెన్షన్ ని మాత్రం చాలా తక్కువమంది అర్ధం చేసుకుంటున్నారు. మరి ఈ పంచాయితీ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.
I’m so glad today on this day we all are speaking about how actresses roles are being written and the instinctive response to blame actress after doing what she was offered ,dont blame the actress blame the system and makers who really think that’s what sells .. and we actors get…
— Dimple Hayathi (@DimpleHayathi) June 6, 2026


