డబ్బు కోసం ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తావా ?

Published on Mar 12, 2019 1:18 pm IST

స్టార్ హీరో హీరోయిన్స్ కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం సర్వసాధారం. అందుకుగానూ వీరికి భారీ స్థాయిలోనే పారితోషికాలు అందుతుంటాయి. దాంతో కొంతమంది స్టార్స్ వెనుకాముందు ఆలోచించుకుండా కొన్ని అభ్యంతరకరమైన ప్రొడక్ట్స్ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి విమర్శలపాలవుతుంటారు.

కాగా తాజాగా సమంత ‘కుర్ కురే’ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆరోగ్యానికి హానికరమైన ఇలాంటి ప్రొడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా వ్యవహరిస్తారు అంటూ.. కొంతమంది నెటిజన్లు సమంతకు ట్వీట్స్ పెడుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తావా.. దయచేసి చెయ్యొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ట్వీట్స్ కి సమంత ఎలా స్పందిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More