బన్నీ కెరీర్ లోనే ఏ సినిమాకు లేనంతగా “పుష్ప”కు.!

Published on Jan 23, 2021 12:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మొట్ట మొదటి సారిగా బన్నీ పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరి అందుకే మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదు. సుకుమార్ టేకింగ్ మరియు బన్నీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను బన్నీ కెరీర్ లోనే ఏ సినిమాకు పెట్టని విధంగా 150 నుంచి 180 కోట్ల మేర భారీ బడ్జెట్ ను పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

అందరి రెమ్యునరేషన్స్ పోగా సినిమాకే అత్యున్నత ప్రమాణాలతో తియ్యాలని పెడుతున్నట్టు తెలుస్తుంది. మరి సుకుమార్ ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తారో ఆన్ స్క్రీన్ పైనే చూడాలి. ఇక ఈ చిత్రానికి గాను దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :